Template:Appeal/default/te: Difference between revisions

From Donate
Jump to navigation Jump to search
Content deleted Content added
imported>Veeven
No edit summary
(No difference)

Revision as of 03:55, 18 November 2011

గూగుల్ వద్ద పది లక్షల సర్వర్లు ఉండవచ్చు. యాహూలో 13,000 మంది సిబ్బంది ఉన్నారు. మాకు 679 సర్వర్లు మరియు 95 మంది సిబ్బంది ఉన్నారు.

వికీపీడియా జాలంలో 5వ స్థానంలో ఉంటూ ప్రతీ నెలా 45 కోట్ల మందికి సహాయపడుతోంది – కోటానుకోట్ల పేజీ వీక్షణలతో.

వాణిజ్యం మంచిదే. వ్యాపారప్రకటనలు చెడ్డవి కాకపోవచ్చు. కానీ అది ఇక్కడ ఉండదు. వికీపీడియాలో కూడదు.

వికీపీడియా విభిన్నమైనది. ఇది గ్రంథాలయం లేదా పార్కు లాంటిది. మన మెదడుకి గుడి వంటిది. మనందరం ఆలోచించడానికి, నేర్చుకోడానికి, మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోడానికి వచ్చే స్థలం.

నేను వికీపీడియాను స్థాపించినప్పుడు, దాన్ని లాభాపేక్షతో కూడిన కంపెనీగా వ్యాపారప్రకటనల పతాకాలతో నిర్మించి ఉండొచ్చు, కానీ భిన్నంగా చేద్దామని నిర్ణయించుకున్నాను. దీన్ని చిన్నగా దగ్గరగా ఉంచడానికి ఏళ్ళ తరబడి శ్రమించాం. మా ఆశయాన్ని నేరవేర్చుకున్నాం, చెత్తని ఇతరులకు వదిలివేసాం.

దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరు $5 విరాళమిస్తే, సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే నిధులు సేకరిస్తే చాలు. కానీ అందరూ విరాళం ఇవ్వలేరు లేదా ఇవ్వకపోవచ్చు. అయినా పర్లేదు. ప్రతి సంవత్సరం తగినంతమంది విరాళమివ్వడానికి ముందుకువస్తే చాలు.

వికీపీడియాను పరిరక్షించి నిలబెట్టడానికి, ఈ సంవత్సరం $5, €10, ¥1000 లేదా మీకు తోచినంత విరాళమివ్వడాన్ని పరిశీలించండి.

ధన్యవాదాలు, జిమ్మీ వేల్స్ వికీపీడియా స్థాపకులు