Template:Appeal/Projects/te

From Donate
Revision as of 20:27, 28 February 2019 by Pcoombe (talk | contribs) (Pcoombe moved page Template:2011FR/Appeal-projects/text/te to Template:Appeal/Projects/te: new location for appeals)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

గూగుల్ వద్ద దాదాపు మిలియను సర్వర్లు ఉండవచ్చు. యాహూలో 13,000 మంది సిబ్బంది ఉండొచ్చు. మా వద్ద 679 సర్వర్లు మరియు 95 సిబ్బంది ఉన్నారు.

వికీపీడియా మరియు దాని సోదర సైట్లు జాలంలో #5 మరియు ప్రతీ నెలా 45 కోట్ల మందికి ఉపయోగపడతాయి - కోటాను కోట్ల పేజీ వీక్షణలతో.

వాణిజ్యం మంచిదే. వ్యాపారప్రకటనలు చెడ్డవి కాదు. కానీ, ఇక్కడ అవి ఉండవు. వికీమీడియాలో.

Wikimedia ప్రత్యేకమైనది. ఇది గ్రంధాలయం లేదా ప్రజా పార్కు లాంటిది. ఇది మనసుకి గుడి. మనందరం ఆలోచించడానికి, నేర్చుకోడానికి, ఇతరులతో మన జ్ఞానాన్ని పంచుకోడానికి వచ్చే స్థలం.

నేను వికీమీడియా ఫౌండేషన్ని స్థాపించినప్పుడు, లాభాపేక్ష ఉన్న కంపెనీగా వ్యాపారప్రకటనల పతాకాలతో నిర్మించి ఉండొచ్చు, కానీ నేను భిన్నంగా చేద్దామని నిర్ణయించుకున్నాను. చిన్నగా దగ్గరగా ఉండటానికి మేం ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నించాం. మా ఆశయాన్ని నెరవేర్చుకున్నాం, చెత్తని ఇతరులకి వదిలేసాం.

దీన్ని చదివే ప్రతీ ఒక్కరూ $5 ఇస్తే, మేం సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే నిధులు సేకరిస్తే సరిపోతుంది. కానీ అందరూ విరాళం ఇవ్వలేరు లేదా ఇవ్వరు. పర్లేదు. ప్రతీ సంవత్సరం తగినంత మంది ఇవ్వాలనుకుంటే చాలు.

వికీమీడియా ప్రాజెక్టులను పరిరక్షించి నిలబెట్టడానికి, ఈ సంవత్సరం $5, €10, ¥1000 లేదా మీకు తోచినంత విరాళమివ్వడాన్ని దయచేసి పరిశీలించండి.

ధన్యవాదాలు,

జిమ్మీ వేల్స్
వికీపీడియా స్థాపకులు