Template:Appeal/JimmyLetterA-2010/te

From Donate
Jump to navigation Jump to search

పదేళ్ళ క్రితం నేను వికీపీడియా గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు చాలా మంది నన్ను వింతగా చూసారు.

కేవలం పంచుకోవాలన్న చిన్న ఉద్దేశంతో, మానవ జ్ఞాన సంపదని సృష్టించడానికి ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు ముందుకొస్తారన్న భావనని కొంతమంది వ్యాపార దృక్పథమున్నవారు అనుమానంతో చూశారని చెప్పుకుందాం.

వ్యాపారప్రకటనలు లేవు. కార్యక్రమ సూచిక లేదు. లోగుట్టులు అసలే లేవు.

వికీపీడియాని స్థాపించి ఒక దశాబ్దం గడచిన తర్వాత, ప్రతీ నెలా 38 కోట్ల మంది పైగా(అంతర్జాల-అనుసంధాన ప్రపంచంలో దాదాపు మూడో వంతు) దీన్ని ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలో ఇది అత్యంత జనాదరణ పొందిన జాలగూళ్ళ(వెబ్సైట్)లో 5వది. మిగతా నాలుగూ, కోట్లాది రూపాయల పెట్టుబడితో, భారీ సిబ్బందితో మరియు ఎడతెగని ప్రచారంతో నిర్మితమై నడుస్తున్నాయి.

కానీ, వికీపీడియా వాణిజ్య జాలగూళ్ళ వంటిది కాదు. ఒక్కో వ్యాసాన్నీ ఔత్సాహికులు వ్రాస్తూండగా ఏర్పడిన సముదాయిక సృష్టి. మా సముదాయంలో మీరూ భాగస్థులే. వికీపీడియాని సంరక్షించుకుంటూ, నిలబెట్టుకునే నిమిత్తం ఈ రోజు మీకు రాస్తున్నాను.

మనందరం కలిసి దీన్ని ఉచితంగా మరియు వ్యాపారప్రకటనలు లేకుండా నడపవచ్చు. దీన్ని అందరికి అందుబాటులో ఉంచుదాం – మీకు కావలసిన విధంగా వికీపీడియాలోని సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని అభివృద్ధి పథంలో నడిపించుదాం – ప్రతీచోటా జ్ఞానాన్ని విస్తరించుతూ, మరియు ప్రతీ ఒక్కరినీ పాల్గొనమని ఆహ్వానించుతూ.

ప్రతీ ఏటా ఈ సమయంలో, వికీపీడియా సముదాయంలోని మిమ్మల్ని మరియు ఇతరులని మన సంయుక్త సంస్థని నిలబెట్టమని $20, $35, $50 లేదా మరింత నిరాడంబర విరాళాలతో తోడ్పడమని మనవి చేస్తున్నాం.

మీరు వికీపీడియాని ఒక సమాచార వనరుగా – మరియు ప్రేరణగా – విలువనిస్తూంటే మీరు ఇప్పుడే స్పందిస్తారని ఆశిస్తున్నాను.

శుభాకాంక్షలతో,

జిమ్మీ వేల్స్

సంస్థాపకులు, వికీపీడియా

తా.క: వికీపీడియా అంటే అపూర్వమైన పనులు చేసే మనలాంటి వ్యక్తుల యొక్క శక్తి. ఒక్కో పదం పేర్చుకుంటూ, మనం వికీపీడియాని వ్రాస్తున్నాం. ఒక్కో విరాళంతో, మనం దీన్ని నిలబెడుతున్నాం. ప్రపంచాన్ని మార్చే మన సామూహిక సామర్థ్యానికి ఇది ఒక నిదర్శనం.